: ప్రకాశం జిల్లా కలెక్టర్ పీఏ నంటూ జేబులు నింపుకున్నాడు!


ప్రకాశం జిల్లా కలెక్టర్ పీఏ నంటూ జేబులు నింపుకుంటున్న మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఒంగోలు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామస్తుడు డేవిడ్, గతంలో ఏపీపీఎస్సీలో అటెండర్ గా పనిచేశాడు. జల్సాలకు అలవాటు పడి మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలో... భూవివాదం పరిష్కరిస్తానని చెప్పి ముండ్లమూరి బండలం నాయుడుపాలెంకు చెందిన రిటైర్డ్ పోస్ట్ మ్యాన్ వద్ద రూ.1.67 లక్షల నగదు, ఒక టీవీని డేవిడ్ తీసుకున్నాడు. దీంతో పాటు, ఆ రిటైర్డ్ పోస్ట్ మ్యాన్ అల్లుడికి హోంగార్డు ఉద్యోగం, అదే గ్రామానికి చెందిన మహిళకు కలెక్టరేట్ లో ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. అయితే, డేవిడ్ చెప్పిన మాటలన్నీ అబద్ధమని, కలెక్టర్ పీఏ కాదని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఒంగోలులోని భాగ్యనగర్ కాలనీలో నిందితుడు డేవిడ్ ను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News