: తనకు జరిగిన అవమానాన్ని బయటపెట్టిన హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్
ఆస్కార్ అవార్డు విన్నర్, ఫార్చ్యూన్ మేగజీన్ కవర్ పేజీపై కొలువుదీరిన హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ తనకు జరిగిన అవమానాన్ని బయటపెట్టింది. బీబీసీ ఛానెల్ లో ప్రసారమైన గ్రాహం నోరాన్ చాట్ షోలో తనకు జరగిన అవమానం గురించి చెప్పింది. సాధారణంగా తానెప్పుడూ గుర్తింపు కోసం పాకులాడలేదని తెలిపింది. అయితే ఓ సారి బ్రిటిష్ కమెడియన్ జాక్ వైట్ హాల్ తో కలిసి ఆమె పబ్ కు వెళ్లింది. అక్కడ ప్రఖ్యాత దర్శకుడు, నటుడు హారిసన్ ఫోర్డ్, స్టార్ వార్స్ డైరెక్టర్ జేజే అబ్రామ్స్ కనిపించారు. దీంతో వారు తనను గుర్తిస్తారని, వారితో కలిసి డ్యాన్స్ చేయాలని భావించి, వారున్న టేబుల్ వద్దకు వెళ్లి డ్యాన్స్ చేశానని తెలిపింది. అయితే వారిద్దరూ తనను గుర్తించలేదని చెప్పింది. వారు తనను గుర్తుపట్టకపోవడంతో ఎలా స్పందించాలో తనకు అర్థం కాలేదని చెప్పింది. దీంతో అలా డాన్స్ చేస్తూ ఇబ్బందిగా తన టేబుల్ వద్దకు వెళ్లిపోయానని గుర్తుచేసుకుంది. దానిని తీవ్రమైన అవమానంగా భావించానని తెలిపింది. తరువాత తానేం చేశానో తనకే అర్థం కాలేదని చెప్పింది. తీవ్ర అవమానభారంతో వెనుదిరిగానని వెల్లడించింది.