: విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ విల్లాను స్వాధీనం చేసుకున్న అధికారులు


బ్యాంకులకు బకాయి పడి, విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాకు చెందిన గోవాలోని ‘కింగ్ ఫిషర్ విల్లా’ను బ్యాంకు అధికారులు ఈరోజు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.90 కోట్ల విలువ చేసే ఈ విల్లాను ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ తన అధీనంలోకి తీసుకుంది. ఈ విల్లాను స్వాధీనం చేసుకునేందుకు ఉత్తర గోవా కలెక్టర్ నిన్న బ్యాంకు అధికారులకు అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా, విజయ్ మాల్యా గోవాకు వచ్చినప్పుడు ఈ భవంతిలోనే ఉండేవారు. ప్రముఖులకు పార్టీలు కూడా ఇందులో జరుగుతుండేవని సమాచారం.

  • Loading...

More Telugu News