: ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ పిటిషన్
ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ లో స్పీకర్, 16 మంది ఎమ్మెల్యేలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తక్షణం చర్యలు తీసుకోవాలని, అనర్హులుగా ప్రకటించాలని ఈ పిటిషన్ లో విన్నవించుకున్నామన్నారు. తక్షణం అనర్హత వేటు వేసేలా ఏపీ సభాపతిని ఆదేశించాలని విజ్ఞప్తి చేసినట్లు రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు.