: పదవిని కోల్పోయిన దిల్మా రౌషెఫ్‌.. మారనున్న బ్రెజిల్ ప్రెసిడెంట్


బ్రెజిల్‌ అధ్యక్షురాలు దిల్మా రౌషెఫ్ తన పదవి కోల్పోయారు. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటోన్న ఆమెను బ్రెజిల్ సెనేట్ సభ్యులు పదవి నుంచి తొలగించారు. సెనేట్ లో దిల్మా రౌషెఫ్ కు వ్యతిరేకంగా 55 ఓట్లు, అనుకూలంగా 22 ఓట్లు పడ్డాయి. దీంతో పదవిని కోల్పోయిన ఆమె స్థానంలో.. వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తోన్న నేత బ్రెజిల్ అధ్యక్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. దిల్మా రౌషెఫ్ పై దర్యాప్తు జ‌ర‌గ‌నుంది. ఆమెపై గ‌త కొంత‌కాలంగా తీవ్ర అవినీతికి పాల్ప‌డుతున్నారంటూ ఎన్నో ఆరోప‌ణ‌లొస్తున్నాయి. నిరుద్యోగం, ద్రవ్యలోటు లాంటి వాస్తవాలను దాచిపెట్టి ఆమె తీవ్ర త‌ప్పుచేశార‌ని సెనేట్ స‌భ్యులు ఆగ్ర‌హంగా ఉన్నారు.

  • Loading...

More Telugu News