: వృక్ష సంపదను కాపాడేందుకు... ‘కంగారూ’ల బలి!


ఆస్ట్రేలియా దేశంలో మాత్రమే కనపడే అరుదైన జంతువు కంగారూ. వీటి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటంతో దాని ప్రభావం పర్యావరణంపై పడుతోందట. ఈ నేపథ్యంలో వాటి జనాభాను నియంత్రించేందుకు అక్కడి అధికారులు నిర్ణయించారు. ఆస్ట్రేలియన్ కాపిటల్ టెరిటరీ (ఏసీటీ) లోని పది రిజర్వులలో సోమవారం నుంచి ఆగస్టు 1 వరకు 1900 కంగారూలను చంపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏసీటీ పార్క్స్, కన్సర్వేషన్స్ డైరెక్టర్ డేనియల్ ఇగ్లెసియాస్ మాట్లాడుతూ, ఈస్ట్ గ్రే కంగారూల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటంతో కొన్ని ప్రాంతాల్లో వృక్ష సంపద నశిస్తోందని అన్నారు.

  • Loading...

More Telugu News