: నిజమైన చట్టానికి అర్థం ఏంటో కాంగ్రెస్‌కి బోధిస్తా: సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి


కాంగ్రెస్ స‌భ్యులు త‌న‌పైన, ర‌క్ష‌ణ శాఖ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్‌పైన వేసిన ప్రివిలేజ్ మోష‌న్ అంశం గురించి బీజేపీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి స్పందించారు. ‘కాంగ్రెస్ పార్టీ చేసే చెడు చెయ్య‌నివ్వండి. నేను వారికి నిజమైన చట్టానికి అర్థం ఏంటో బోధిస్తాను’ అని ఈరోజు ఆయన ఢిల్లీలో వ్యాఖ్యానించారు. అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాఫ్ట‌ర్ కుంభ‌కోణం కేసులో తాను స‌మ‌ర్పించిన ప‌త్రాలు బోగ‌స్ అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంద‌ని, అంతేగాక‌ నేష‌న‌ల్ హెరాల్డ్ కేసు అంశాన్ని పార్ల‌మెంట్‌లో లేవ‌లెత్తినందుకు కాంగ్రెస్ పార్టీ త‌న‌ను టార్గెట్ చేసింద‌ని అన్నారు. ప్రివిలెజ్ మోష‌న్ చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ప్పుడు కాంగ్రెస్ గుట్టును విప్పే ప‌త్రాల‌న్నీ స‌మ‌ర్పిస్తాన‌ని స్వామి పేర్కొన్నారు. చ‌ట్టాన్ని ఉప‌యోగించుకునే ప‌ద్ధ‌తి కాంగ్రెస్‌కి తెలియ‌ద‌ని, ఆ పార్టీకి చ‌ట్టాన్ని గురించి బోధ చేస్తాన‌ని అన్నారు.

  • Loading...

More Telugu News