: పెంపుడు శునకం ఆహారం రుచి చూసిన సెరెనాకు...!


ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ రెండు రోజుల క్రితం ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ మ్యాచ్ ఆడేందుకని రోమ్ వెళ్లింది. అక్కడ ఆమె బస చేసిన హోటల్ నిర్వాహకులు ఆమె పెంపుడు శునకం ‘చిప్’ కోసం ప్రత్యేక ఆహారం తయారు చేశారు. దానిని ఏఏ పదార్థాలతో తయారు చేశారో తెలియజెబుతూ ఒక మెను కూడా సెరెనాకు అందజేశారు. ఆ మెనూను చూసిన సెరెనాకు ఆ వంటకాన్ని తినిచూస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చి, వెంటనే ఒక స్పూన్ తినడం జరిగింది. దాని ప్రభావం కొన్ని గంటల తర్వాత సెరెనా కు తెలిసింది. స్టమక్ అప్ సెట్ అవడంతో కొంత ఇబ్బంది పడింది. అయితే, తేరుకున్న సెరెనా మర్నాటి మ్యాచ్ లో విజయం సాధించింది. ‘చిప్’ ఆహారం రుచి చూశారు కదా! ఎలా ఉంది?’ అనే ప్రశ్నకు ..‘నచ్చలేదు. ఇది మనుషులు తినేది కాదని ఆ మెనూలో రాసి ఉంటే బాగుండేది’ అని సెరెనా జవాబు ఇచ్చింది.

  • Loading...

More Telugu News