: బీజేపీ చెప్పేసింది... చంద్రబాబూ! సమాధానం చెప్పు: అంబటి రాంబాబు
ప్రత్యేకహోదాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడాలని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై తమ వైఖరి ఏంటన్నది బీజేపీ రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేసిందని అన్నారు. అయితే ఇప్పుడు టీడీపీ వైఖరి ఏంటన్నది స్పష్టం చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు విప్పాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రజలను మోసం చేయడాన్ని ఇప్పటికైనా మానుకోవాలని ఆయన సూచించారు. చంద్రబాబు నిర్ణయం తరువాతే తాము ఏదైనా మాట్లాడితే బాగుంటుందని ఆయన చెప్పారు.