: హామీలు నెరవేర్చాలని మాత్రమే బాబు లేఖలు రాశారు... ప్రత్యేకహోదా ఎప్పుడూ ప్రస్తావించలేదు: కోర్ కమిటీ


ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేంద్రానికి పలు సందర్భాల్లో లేఖలు రాశారని, ఏ లేఖలోనూ ఆయన ప్రత్యేకహోదా గురించి ప్రస్తావించలేదని బీజేపీ కోర్ కమిటీ తెలిపింది. విభజన చట్టంలోని ప్రతి హామీని కేంద్రం నెరవేరుస్తుందని కమిటీ వివరించింది. విభజన చట్టంలో ప్రత్యేకహోదా లేదని ఆ సందర్భంగా ఈ కమిటీ తెలిపింది. చట్టంలో లేని హోదాను ఎలా అమలు చేస్తామని వారు ఎదురు ప్రశ్నించారు. టీడీపీ తమకు మిత్రపక్షమని చెప్పిన బీజేపీ కోర్ కమిటీ, మామూలుగా భార్యాభర్తల కాపురంలోనే విభేదాలు ఉంటాయని, అలాంటిది పొత్తులో విమర్శలు ఉండవని భావించడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. హోదా ఇవ్వకపోయినప్పటికీ ప్యాకేజీ ఇస్తామని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News