: నా డబ్బుతో ఎంజాయ్ చేసే సమయం ఇంతవరకూ నాకు దొరకలేదు, నేనో ఫకీరు లాంటి వాడిని: షారుఖ్ ఖాన్
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తన వ్యక్తిగత జీవితంలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. తాజాగా ఓ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నిజ జీవితంలోని పలు ఆసక్తికర అంశాలను గురించి చెప్పాడు. తన వద్ద ఉన్న డబ్బుతో ఎంజాయ్ చేసే సమయం తనకు ఇంతవరకూ దొరలేదని చెప్పాడు. తాను తన వ్యక్తిగత జీవితాన్ని ఎటువంటి ఆర్భాటాలు లేకుండా గడుపుతానని, తానో ఫకీరు లాంటి వాడినని పేర్కొన్నాడు. పొడవాటి దుస్తులు కూడా ధరిస్తానని షారుఖ్ చెప్పాడు. తాను, తన కుటుంబం సాధారణ జీవనవిధానాన్నే అవలంబిస్తామని మ్యాగ్ జైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుఖ్ పేర్కొన్నాడు.