: ఏపీకి ప్రత్యేకహోదా లేదు, రాదు: సిధ్ధార్థ్ నాథ్ సింగ్


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా లేదని, భవిష్యత్ లో కూడా రాదని ఏపీ బీజేపీ ఇన్ఛార్జీ సిద్ధార్థ్ నాధ్ సింగ్ స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, దేశంలోని 11 రాష్ట్రాలకు ఇప్పటికే ప్రత్యేకహోదా ఉందని, కొత్తగా మరో రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదని అన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం భవిష్యత్ లో ఏ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదని ఆయన తెలిపారు. ఏపీకి కూడా ఇవ్వడం వీలుకాదని ఆయన తెలిపారు. కానీ బీజేపీకి ఏపీ ప్రత్యేక రాష్ట్రమని ఆయన చెప్పారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ లేకపోయినా బీజేపీకి స్పెషల్ స్టేట్ అని ఆయన తెలిపారు. నీతి ఆయోగ్ ద్వారా మరిన్ని నిధులు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News