: దేశ ఆర్ధిక పరిస్థితులకు రఘురామ్ రాజన్‌ను బాధ్యుడ్ని చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది: సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యుడి నోటీస్
దేశ ఆర్ధిక పరిస్థితులకు రఘురామ్ రాజన్‌ను బాధ్యుడ్ని చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ ఈరోజు నోటీస్ ఇచ్చారు. బీజేపీ సీనియర్ నేత, పార్లమెంట్ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి నిన్న మీడియాతో మాట్లాడుతూ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ భారత్‌కి అనుకూలుడు కాదనిపిస్తోందని, రాజన్ అనుసరిస్తోన్న ఆర్థిక విధానాలు దేశానికి ఆర్ధిక నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయని వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన తివారీ .. దేశ ఆర్ధిక పరిస్థితికి బీజేపీ అనుసరిస్తోన్న విధానాలే కారణమన్నారు. బీజేపీ పాలన కారణంగానే ద్రవ్యోల్బణం పెరిగిందని దీనికి రాజన్‌ను బాధ్యుడ్ని చేయడం ఏమిటని ప్రశ్నించారు.