: రాజ్యసభ నిరవధిక వాయిదా...కేవీపీ బిల్లు చర్చకు రాలేదు!


రాజ్యసభ నిరవధిక వాయిదా పడింది. ప‌ద‌వీ కాలం ముగిసిన రాజ్య‌స‌భ‌ స‌భ్యుల‌కు వీడ్కోలు ప‌లికేందుకు ఉద్దేశించిన నేటి సమావేశాల్లో ఆయా సభ్యుల సేవలను ప్రశంసించారు. రెండు ప్రభుత్వాల్లోను కీలక పాత్ర పోషించారంటూ వారిని అంతా అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వెంటనే ఇవ్వాలని కాంగ్రెస్ స‌భ్యుడు కేవీపీ రాజ్యసభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ప్రవేశపెట్టిన సంగ‌తి తెలిసిందే. రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యే అవకాశాలు ఉండ‌డంతో ఏపీ ప్ర‌జ‌లు దీనిపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ హ‌మీద్ అన్సారీ నేడు రాజ్య‌స‌భ‌లో ఇత‌ర అంశాలేవీ చ‌ర్చించవ‌ద్ద‌ని సూచించడంతో దీనిపై చర్చించే అవ‌కాశం లేకుండా పోయింది. దీంతో నేటి రాజ్యసభలో స‌భ్యులు సంయ‌మ‌నం పాటించారు. పదవీకాలం ముగిసిన సభ్యులకు వీడ్కోలు పలికిన అనంతరం రాజ్యసభ నిరవధిక వాయిదా పడింది. దీంతో రానున్న పార్లమెంటు వర్షాకాల స‌మావేశాల్లోనే ఈ బిల్లు పెడ‌తార‌ని ఏపీ ప్రజలు ఆశిస్తున్నారు.

  • Loading...

More Telugu News