: కొత్త దంపతులూ!.. వింతపోకడలతో కాపురాలు కూల్చుకోకండి!: నన్నపనేని రాజకుమారి
కొత్త దంపతులు వింతపోకడలకు పోయి తమ కాపురాలను పాడుచేసుకోవద్దని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి సూచించారు. గుంటూరులో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, కొత్త దంపతులు చిన్న చిన్న విషయాలకు, గొడవలకే కోర్టులను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. ఈ పద్ధతి మంచిది కాదని తద్వారా కాపురాలు కూలిపోతాయని అన్నారు. తాను బాధ్యతలు స్వీకరించిన మూడు నెలల్లో ఎంతో మంది మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్లు నన్నపనేని చెప్పారు.