: ప్రియుడు పెళ్లి చేసుకోనని చెప్పగానే అమెరికా ఫ్లైటెక్కేసిన నర్గీస్ ఫక్రీ...తలపట్టుకున్న నిర్మాతలు


బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ, నటుడు ఉదయ్ చోప్రా చాలాకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరి ప్రేమ వ్యవహారంపై నర్గీస్ ను ఎప్పుడు అడిగినా తామిద్దరం మంచి స్నేహితులమని, ఏ విషయమైనా అతనితో చెప్పుకుంటానని, తమది అంత బలమైన బంధమని చెప్పిందే కానీ, తామిద్దరం ప్రేమికులమని మాత్రం ఏనాడూ చెప్పలేదు. అప్పట్లో వివాహం చేసుకుందామని ఉదయ్ చోప్రా ప్రతిపాదించగా, కెరీర్ ఉచ్ఛస్థితిలో ఉందని, ఇప్పుడే వివాహం ఇష్టం లేదని చెప్పిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అవకాశాలు లేకపోవడంతో ఉదయ్ చోప్రాను పెళ్లి చేసుకుందామనే ప్రతిపాదనను నర్గీస్ ఫక్రీ చేసింది. దీనికి ఉదయ్ చోప్రా అంగీకరించలేదు. దీంతో ఉదయ్ మీద అలిగిన నర్గీస్ ఫక్రీ న్యూయర్క్ ఫ్లైట్ ఎక్కేసింది. దీంతో అజార్, హౌస్ ఫుల్ 3 ప్రచార కార్యక్రమాలు, బాంజో షూటింగ్ ఇబ్బందుల్లో పడ్డాయి. దీంతో నిర్మాతలు ఆమెను ఎలా రప్పించాలా? అని తలపట్టుకుని కూర్చున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News