: డబ్బు సంచులతో తెలంగాణ మంత్రివర్గమంతా పాలేరులోనే పనిచేస్తోంది: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
డబ్బు సంచులతో తెలంగాణ మంత్రి వర్గమంతా పాలేరులోనే పనిచేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక ప్రచారంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ... పాలేరులో టీఆర్ఎస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని ఆయన అన్నారు. కమీషన్లు వచ్చే ప్రాజెక్టులకే కేసీఆర్ భారీగా నిధులు కేటాయిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో దళితులు తీవ్రంగా మోసపోయారని, జనాభాలో 16 శాతమున్న మాల, మాదిగలకు కేసీఆర్ ఒక్క మంత్రి పదవీ ఇవ్వలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.