: కాంగ్రెస్‌ నేతలది పూటకో మాట.. ఊరికో ముచ్చట: వరంగల్‌లో హరీశ్ రావు


కాంగ్రెస్ నేత‌ల‌పై తెలంగాణ భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి హ‌రీశ్ రావు మ‌రోసారి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్‌ నేతలు పూటకో మాట.. ఊరికో ముచ్చట చెబుతున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈరోజు వరంగల్‌ జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో మంత్రి చందులాల్‌, ప‌లువురు ఎమ్మెల్యేల‌తో క‌లిసి హ‌రీశ్‌రావు పర్యటిస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నర్సంపేట్‌లో దేవాదుల ప్రాజెక్టు, పాకాల సరస్సును ఆయన సందర్శించారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్ర‌భుత్వం నిర్మిస్తోన్న‌ ప్రాజెక్టులను టీడీపీ అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని, అటువంటి పార్టీతో కాంగ్రెస్‌ దోస్తీ చేస్తోందని ఆయ‌న అన్నారు. ప్ర‌తిప‌క్షాలు ఎన్ని కుట్ర‌లు చేసినా తాము అనుకున్న ప్రాజెక్టులు పూర్తి చేసి తీరుతామ‌ని హ‌రీశ్ రావు ఉద్ఘాటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేస్తామ‌ని, పీఎంఎస్‌కేవై పథకం ద్వారా దేవాదుల పూర్తిచేస్తామని, జిల్లాలోని నర్సంపేటలో 12 చెక్‌డ్యాంలు నిర్మిస్తామ‌ని హ‌రీశ్ రావు చెప్పారు.

  • Loading...

More Telugu News