: ఓ మై గాడ్... తమిళనాట పట్టుబడ్డ 500 నకిలీ ఈవీఎంలు


ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసేలా నకిలీ నోట్లు చెలామణి అవుతుంటాయన్న సంగతి తెలిసిందే. తమ పబ్బం గడుపుకుని లాభాలను ఆర్జించడానికి వివిధ రకాల ప్రొడక్టులను తయారు చేసి, వాటికి ప్రముఖ బ్రాండ్ల పేర్లు అంటించి అమ్ముకునే వాళ్లనూ చూశాం. ఇక ఎన్నికల వేళ, తమిళనాడులో ఏకంగా నకిలీ ఈవీఎం మెషీన్లను తయారు చేశారు. అంటే... వీరు ఏకంగా రాజ్యాంగ వ్యవస్థకే ద్రోహం తలపెట్టాలని చూసినట్టు. తంజావూరు జిల్లాలోని తిరువారూర్ లో తనిఖీలు నిర్వహిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందికి ఇవి తారస పడటంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనలో సంబంధమున్న ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం స్టేషనుకు తరలించారు. వీరి వెనుక ఎవరున్నారు? ఎవరికి అనుకూలంగా ఓట్లను వేసుకోవాలన్నది వీరి ఆలోచన? వీటిని ఎలా అసలు ఈవీఎంల ప్లేస్ లలో పెట్టాలని అనుకున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి వుంది. కాగా, తిరువరూర్ కేంద్రం నుంచి డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి బరిలో ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News