: కన్నయ్యను చంపేస్తానంటూ బెదిరించిన వ్యక్తి అరెస్టు
ఢిల్లీలోని జవహర్లాల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ కన్నయ్య కుమార్ను చంపేస్తానంటూ కొన్ని రోజుల క్రితం ప్రకటించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గతనెల ఏప్రిల్ 14వ తేదీన వర్సిటీ వద్ద ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్(డీటీసీ)బస్లో ఆయుధాలు, కన్నయ్యతో పాటు వర్సిటీ పరిశోధక విద్యార్థి ఉమర్ ఖలీద్ను చంపుతామంటూ ఉన్న లేఖతో ఉన్న ఓ బ్యాగ్ లభించింది. లేఖలో ఉత్తర ప్రదేశ్ నవనిర్మాణ సేన అధ్యక్షుడు అమిత్ జానీ సంతకం స్పష్టంగా కనిపించింది. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిన్న రాత్రి అమిత్ జానీని అరెస్టు చేశారు. అయితే బస్సులోని బ్యాగులో దొరికిన తుపాకీ ఏఐఎంఐఎం అధినేత అసరుద్దీన్ ఓవైసీని చంపడానికి ఉపయోగించాలనుకున్నామని అమిత్ జానీ వ్యాఖ్యానించాడు.