: అది ప్రపంచంలోనే అతిపెద్ద విమానం... శంషాబాద్ విమానాశ్రయంలో సేదతీరుతోంది!


ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానంగా రికార్డు కెక్కిన అంటనోవ్ ఏఎన్-225 మ్రియా విమానం శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈ ఉదయం ల్యాండయింది. ఆరు టర్బో ఫ్యాన్ ఇంజన్లతో ఉండే ఈ భారీ లోహ విహంగం ఏకంగా 640 టన్నుల బరువును మోసుకెళ్లగలుగుతుంది. ఈ విమానం తుర్కమెనిస్థాన్ నుంచి ఆర్జీఐఏకు రాగా, విమానాశ్రయ అధికారులు నీళ్లు చల్లి సంప్రదాయ స్వాగతం పలికారు. చెక్ రిపబ్లిక్ నుంచి ఆస్ట్రేలియా వెళుతున్న విమానం విశ్రాంతి కోసం ఇక్కడికి వచ్చింది. హైదరాబాద్ ఎయిర్ పోర్టులోని పొడవైన రన్ వే, విమానం ల్యాండింగ్ కు అనుకూలమన్న భావనతోనే, ఈ విమానం ఇక్కడ ల్యాండయింది. చెక్ రిపబ్లిక్‌లో తయారు చేసిన 133 టన్నుల జనరేటర్‌ ను ఈ విమానం ఆస్ట్రేలియాకు చేర్చాల్సి వుంది.

  • Loading...

More Telugu News