: దేశంలో ఎక్కడా లేని విధంగా ఆవు మూత్రంపై ఏపీ సర్కారు పన్ను!


ఇండియాలో మరెక్కడా లేని విధంగా ఆవు మూత్రంపై ఏపీ సర్కారు 5 శాతం పన్ను విధించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విలువ ఆధారిత పన్ను (వ్యాట్) చట్టం - 2005లోని ఐదవ షెడ్యూల్ నిబంధనల ప్రకారం, గోమూత్రంపై పన్ను విధించే అధికారం తమకు ఉన్నదని చెబుతూ, వాణిజ్య పన్నుల విభాగం నుంచి వివిధ సంస్థలకు షోకాజ్ నోటీసులు వెళ్లాయి. ఇందులో భాగంగా డ్రగ్స్, కాస్మోటిక్స్ చట్టం - 1940 కింద వివిధ ప్రొడక్టుల తయారీకి అనుమతి పొందిన సంస్థలపై పన్ను విధిస్తున్నట్టు తెలిపింది. ఆయుర్వేదం, హోమియోపతి, చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారు చేస్తున్న సంస్థలకు నోటీసులు ఇచ్చింది. గోమూత్రాన్ని ఉపయోగించి పలు రకాల వ్యాధుల చికిత్సలకు మందులు తయారు చేస్తున్నారని, రోజుకు పది వేల లీటర్ల వ్యాపారం జరుగుతోందని వివరించింది. కాగా, వివిధ రకాల షాంపూలు, సబ్బులు, ఫినాయిల్ వంటి ఉత్పత్తుల నుంచి అగర్ బత్తీలు, దోమల నివారణకు వినియోగించే కాయిల్స్ తదితరాల్లో గోమూత్రాన్ని విరివిగా వినియోగిస్తున్నప్పటికీ, ఈ తరహా పన్ను దేశంలో ఎక్కడా లేదని, ఏపీలో మాత్రం ఎందుకంటూ వ్యాపారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News