: హోదా సంజీవని కాదంటూనే కేంద్రాన్ని ఇబ్బంది పెడతారా?: చంద్రబాబుపై బీజేపీ విమర్శ


ప్రత్యేక హోదా సంజీవని వంటిదేమీ కాదంటూ, గతంలో అనేకమార్లు వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, హోదా తమకు వద్దన్న సంకేతాలు ఇచ్చి, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలోని సర్కారును ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని బీజేపీ ఆరోపించింది. పలువురు నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, గతంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఎందుకు హోదాను అడగలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉందని ఓ వైపు చెబుతూ, మరోవైపు ప్రత్యేక విమానాల్లో ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. తమ దుబారాలకు కేంద్రం నిధులు కావాలని తెలుగుదేశం పార్టీ అడుగుతోందని, బాబు నేరుగా విమర్శించకుండా, చిన్న చిన్న నేతలతో ప్రధానిని తిట్టిస్తున్నారని, ఇది నీచ రాజకీయమని మండిపడ్డారు. ఇప్పటివరకూ ఏపీకి రూ. 1.41 లక్షల కోట్లకు పైగా నిధులు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చాయని చెబుతూ, ఆ వివరాలను శ్రీనివాస్ మీడియాకు అందించారు.

  • Loading...

More Telugu News