: 104 ఇన్నింగ్సుల్లో 123 పరుగులే చేశాడు...అత్యంత చెత్త రికార్డు అతనిదే!
క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు న్యూజిలాండ్ క్రికెటర్ పేరిట నమోదైంది. 104 ఇన్నింగ్స్ ఆడిన క్రిస్ మార్టిన్ (41) కేవలం 123 పరుగులు మాత్రమే చేశాడు. న్యూజిలాండ్ క్రికెటర్ గా 71 టెస్టులు ఆడిన క్రిస్ మార్టిన్ బౌలింగ్ లో 233 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అదే సమయంలో బ్యాటింగ్ లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. క్రిస్ మార్టిన్ అత్యధిక స్కోరు 12 పరుగులు కావడం విశేషం. ఈ పరుగులు కూడా ఒకప్పటి పసికూన బంగ్లాదేశ్ పై సాధించినవి. ఆయన కెరీర్ బ్యాటింగ్ యావరేజ్ 2.36 కాగా, ఆయన 36 సార్లు కనీసం ఖాతా కూడా తెరవలేకపోయాడు. 2000-13 వరకు కెరీర్ కొనసాగించిన క్రిస్ మార్టిన్ కు 'వాకింగ్ వికెట్' అనే ముద్దు పేరు ఉంది.