: నా లివింగ్ రూమ్ ఎనిమిదివేల గులాబీలతో నిండిపోయింది: బాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్
బాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ కు గుర్తు తెలియని అభిమాని ఒకరు ప్రతిరోజు వెయ్యి గులాబీలు పంపిస్తున్నారుట. ఈ విషయాన్ని సోనాల్ స్వయంగా పేర్కొంది. ఇప్పటివరకు అతను ఎనిమిది వేల గులాబీలు పంపాడని, ఆ గులాబీలతో తన లివింగ్ రూమ్ నిండిపోయిందని చెప్పింది. గులాబీల మధ్య కూర్చుని ఉన్న ఒక ఫొటోను సోనాలీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘నాకు గులాబీలు పంపిస్తున్న మీరెవరో నాకు తెలియదు! కనుక, మీకు కృతఙ్ఞతలు చెప్పడం కన్నా నేనేమీ చేయలేను. థ్యాంక్యూ!’ అంటూ ట్వీట్ చేసింది. తన రహస్య అభిమాని ఎవన్నది సమయం వచ్చినప్పుడు ఆ అభిమానే బయట పెట్టాలని సోనాలీ పేర్కొంది.