: రాణించిన బౌలర్లు... ఆకట్టుకున్న ధావన్, వార్నర్, విలియమ్సన్


హైదరాబాదు ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాదు ఓపెనర్లు ఆకట్టుకున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన సన్ రైజర్స్ హైదరాబాదుకు వార్నర్ (46), శిఖర్ ధావన్ (34) శుభారంభం ఇచ్చారు. అయితే దానిని భారీ స్కోర్లుగా మలచడంలో ఇద్దరూ తడబడ్డారు. విలియమ్సన్ (27) నిలదొక్కుకున్నప్పటికీ సహచరులు ఒక్కొక్కరు వెనుదిరగడంతో భారీ షాట్లకు పోలేదు. యువరాజ్ సింగ్ (8), హెన్రిక్స్ (0), హూడా (10), నమన్ ఓజా (7) భువనేశ్వర్ (1) కూడా విఫలమయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు సాధించింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ బౌలర్లలో డుమిని మినహా అంతా వికెట్లు తీయగా, మిశ్రా, కల్టర్ నెయిల్ చెరి రెండు వికెట్లు సాధించి సత్తాచాటగా, యాదవ్, షమి, మోరిస్ చెరో వికెట్ తీసి వారికి సహకరించారు. 147 పరుగుల విజయ లక్ష్యంతో కాసేపట్లో ఢిల్లీ బ్యాటింగ్ ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News