: మా ‘అమ్మ’ గుడి పనులు త్వరలో పూర్తవుతాయి: డ్యాన్స్ మాస్టర్ లారెన్స్
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తన తల్లికి గుడి కడుతున్న విషయం తెలిసిందే. ఈ గుడి నిర్మాణపు పనులు మరో రెండు వారాల్లో పూర్తవుతాయని లారెన్స్ తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నాడు. ప్రపంచంలోని తల్లులందరికీ ఈ గుడిని అంకితమిస్తున్నానని ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు. తన తల్లి విగ్రహంతో పాటు గుడి ఆవరణ ఫొటోలను లారెన్స్ పోస్ట్ చేశాడు. కాగా, ప్రస్తుతం ముని-4 చిత్రంలో లారెన్స్ నటిస్తున్నాడు.