: నాణ్యతాప్రమాణాల పరీక్షల్లో పెయిన్ కిల్లర్ ‘కాంబీఫ్లామ్’ విఫలం
పెయిన్ కిల్లర్ గా ప్రసిద్ధి పొందిన కాంబీఫ్లామ్ ట్యాబ్లెట్లు నిబంధనలకు అనుగుణంగా లేవని సంబంధిత అధికారులు గుర్తించారు. డిజింటిగ్రేషన్ పరీక్షల్లో ‘కాంబీఫ్లామ్’ విఫలమైందని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) వెల్లడించింది. ట్యాబ్లెట్లు శరీరంలోకి వెళ్లాక అది పగిలిపోవడానికి, కరిగిపోవడానికి ఎంత సమయం పడుతుందనేది లెక్కించడానికి, ట్యాబ్లెట్ల నాణ్యతకు సంబంధించి నిర్వహించిన ఒక ప్రామాణిక పరీక్షలో ‘కాంబీఫ్లామ్’ విఫలమైంది. దీంతో ఈ ట్యాబ్లెట్లను తయారు చేసే ఫ్రెంచ్ ఔషధ తయారీ సంస్థ ‘సనోఫీ’కి సీడీఎస్సీఓ అధికారులు నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా సంబంధిత బ్యాచ్ లకు చెందిన కాంబీఫ్లామ్ ట్యాబ్లెట్లు విఫలమవడంతో వాటిని సంస్థ ఇప్పటికే వెనక్కి తీసుకుంది.