: జీ ఫర్ గన్, టీ ఫర్ ట్యాంక్, ఆర్ ఫర్ రాకెట్... పిల్లలను ఆకర్షించడమే లక్ష్యంగా మొబైల్ యాప్ విడుదల చేసిన ఉగ్రవాదులు
పిల్లల కోసం జీహాదీస్ట్ థీమ్స్ తో ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్ ను రూపొందించింది ఐఎస్ఐఎస్ ఉగ్ర సంస్థ. జీ ఫర్ గన్, టీ ఫర్ ట్యాంక్, ఆర్ ఫర్ రాకెట్.. వంటి పదాలను పిల్లల మెదళ్లలోకి ఎక్కిస్తూ వారిని ఆకర్షించడమే లక్ష్యంగా ఇస్లామిక్ స్టేట్ లైబ్రరీ ఆఫ్ జీల్ ఈ మొబైల్ యాప్ ను విడుదల చేసింది. ఇస్లామిక్ స్టేట్ ‘టెలిగ్రామ్’ చానల్ ద్వారా ఉగ్రవాదులు ఈ యాప్ ను విడుదల చేశారు. ఇది అలాంటిలాంటి సాధారణ యాప్ కాదు, దీనిలో ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. యాప్‌లోని గేమ్స్ ద్వారా అరబిక్ లెటర్స్ నేర్చుకోవచ్చు, ‘నషీద్’ పేరిట దీనిలో ఉన్న సాంగ్ ద్వారా ఆ ఆల్పాబిట్లపై పిల్లలు ఆసక్తిగా పట్టు సాధించవచ్చు. ఇస్లామిక్ స్టేట్ పిల్లల కోసం యాప్ ను రూపొందించి విడుదల చేయడం ఇదే ప్రథమం.