: అమెరికాలో కార్మికుల దుస్థితి... టాయ్ లెట్ కు కూడా అనుమతించడం లేదట!


ఎంత గొప్ప దేశంలో అయినా కింది స్థాయి కార్మికులకు కష్టాలు ఉంటాయని అమెరికాలో ఈ ఘటన నిరూపించింది. ప్రపంచంలో ఏ చిన్న ఘటన జరిగినా మానవహక్కుల ఉల్లంఘన అంటూ గగ్గోలు పట్టే అమెరికాను ఈ సంఘటన కలకలం రేపింది. ఫాస్ట్ ఫుడ్ కల్చర్ పెరిగిపోవడంతో, డిమాండ్ కు తగ్గ సప్లై చేసేందుకు అమెరికాలోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కుస్తీపడుతున్నాయి. అందులో భాగంగా చికెన్ ను అందించే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో పని చేసే కార్మికులకు క్షణం తీరిక ఇవ్వడం లేదు. కనీసం టాయ్ లెట్ కు వెళ్లేందుకు కూడా వారిని అనుమతించడం లేదు. దీంతో పని గంటల్లో వారు వాటిని ఆపుకునేందుకు డైపర్లను సప్లై చేస్తున్నారు. విధుల సమయంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తినా అందులోనే కానిచ్చేయాలని, ఉత్పత్తిని పెంచాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉద్యోగులను ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా ఈ వాస్తవాలు వెలుగు చూశాయి. అయితే కొన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తమ దగ్గర అలా ఉండదని, కార్మికుల శ్రేయస్సే తమ శ్రేయస్సు అని చెప్పగా, కొన్ని సంస్థలు మాత్రం దీనిని అంగీకరించాయి. కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News