: తాజ్ మహల్ ను మళ్లీ ఇప్పుడే చూస్తున్నాను: బాలీవుడ్ నటి ప్రీతి జింతా
ఇంతకు ముందు ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ఇక్కడికి వచ్చిన సందర్భంలో తాజ్ మహల్ చూశానని, మళ్లీ ఇప్పుడే చూస్తున్నానని బాలీవుడ్ నటి ప్రీతీ జింతా పేర్కొంది. తన భర్త జీన్ గుడ్ ఇనో, అత్తింటి వారి బంధువులతో కలిసి తాజ్ మహల్ ను సందర్శించినట్లు తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొంది. గతంలో తాను నటించిన సినిమా షూటింగ్ తాజ్ మహల్ బయట జరిగిందని చెప్పింది. ఈసారి కేవలం తాజ్ మహల్ ను సందర్శించేందుకే వచ్చానని, దీని నిర్మాణం, సౌందర్యము చాలా అద్భుతంగా ఉన్నాయని సొట్టబుగ్గల ప్రీతీ ఆ పోస్ట్ లో పేర్కొంది.