: బాబుకు చీమ కుట్టినట్లయినా ఉందా?: అనంత వెంకట్రామిరెడ్డి
తన స్వలాభం, స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు పాకులాడుతూ, రైతుల ప్రాణాలను పణంగా పెడుతున్నారని నేత అనంత వెంకట్రామిరెడ్డి నిప్పులు చెరిగారు. గోదావరిపై కేసీఆర్ సర్కారు అక్రమ ప్రాజెక్టులను కడుతుంటే, బాబు సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదని మండిపడ్డారు. ఈ మధ్యాహ్నం కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణ ప్రాజెక్టులకు నిరసనగా వైకాపా దీక్షలు చేపట్టనుందని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు పెరగడానికి ముఖ్య కారణం నాడు వైకాపా చేసిన హెచ్చరికలను పెడచెవిన పెట్టడమేనని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి, కృష్ణా జలాలపైనే ఆధారపడి వున్నదని, పైనుంచి నీరు రాకపోతే రైతులు ఎలా బతుకుతారని, మంచి నీరెలాగని ఆయన ప్రశ్నించారు.