: అమరావతి వెళ్తాం...ముఖ్యమంత్రికి సహకరిస్తాం: ఏపీ సచివాలయ జేఏసీ
అమరావతికి తరలివెళ్లేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని ఏపీ సచివాలయ ఉద్యోగ జేఎసీ అధ్యక్షుడు మురళీకృష్ణ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, జూన్ 1 నుంచి ఏపీ రాజధానిలో పూర్తి స్థాయి పాలన సాగించాలని భావిస్తున్నారని, అందుకు తగ్గట్టుగా ఉద్యోగులు తరలాలని ఆయన సూచించారని అన్నారు. తాము అందుకు సానుకూలంగా ఉన్నామని, అయితే తమ సమస్యలు కూడా పరిష్కరించాలని కోరుతున్నామని ఆయన చెప్పారు. ఈ సమస్యలు పరిష్కరిచేందుకు సీఎం సంసిద్ధత వ్యక్తం చేశారు. సీఎస్ కు తమ పరిస్థితులు వివరించామని ఆయన అన్నారు. తమ బాధలు ఆయన అర్థం చేసుకున్నారని ఆయన చెప్పారు. అదే సమయంలో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, సహకరించాలని కోరారని, తాము అందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఉద్యోగులు ఏపీ రాజధాని అమరావతికి తరలేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని ఆయన తెలిపారు.