: జూన్ 11న రాజ్యసభ ఎన్నికలు.. ఏపీలో 4, తెలంగాణలో 2 స్థానాలు


తెలుగు రాష్ట్రాల్లో పదవీ కాలం ముగుస్తున్న రాజ్యసభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీలో 4, తెలంగాణలో 2 స్థానాలకు జూన్ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు మే 31వ తేదీగా నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా మరో 57 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 24వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా, పదవీకాలం ముగియనున్న ఎంపీల వివరాలు... ఏపీ నుంచి నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి, జేడీ శీలం, జైరాం రమేష్, తెలంగాణ నుంచి గుండు సుధారాణి, వి. హనుమంతరావుల పదవీ కాలం జూన్ 21తో ముగియనుంది.

  • Loading...

More Telugu News