: అర్జున్! మలైకాకు దూరంగా ఉండు!: బాలీవుడ్ నటుడికి బోనీకపూర్ హెచ్చరిక


బాలీవుడ్ సినీ దంపతులు అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా కాపురం కూలడానికి కారణం అర్జున్ కపూర్ అని బాలీవుడ్ కోడైకూస్తోంది. ఈ కథనాలను బలపరుస్తూ వారిద్దరూ విడిపోయిన తరువాత అర్జున్ కపూర్ పలు సందర్భాల్లో మలైకా ఉంటున్న ఫ్లాట్ కు వెళ్లడం, మీడియా ప్రతినిధులకు వివిధ సందర్భాల్లో కనిపించడం జరిగింది. వీటిపై వరుస కథనాలు మీడియాలో రావడంతో అర్జున్ కపూర్ తండ్రి బోనీ కపూర్ అప్రమత్తమయ్యాడు. హిట్ సినిమాలతో ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో నిలదొక్కుకుంటున్న అర్జున్ కపూర్ కెరీర్ కు ఇవి ప్రతిబంధకంగా మారే అవకాశం ఉందని ఆలోచించి కుమారుడ్ని కట్టడి చేశాడు. వీటిని సల్మాన్ సీరియస్ గా తీసుకుంటే ఏం జరుగుతుందో బోనీ కపూర్ కు తెలుసు. అందుకే మలైకా వైపు కన్నెత్తి చూడవద్దని అర్జున్ కపూర్ ను హెచ్చరించాడు. దీంతో అర్జున్ గత రెండు వారాలుగా మలైకా ఇంటి పరిసరాల్లో కనబడలేదని బాలీవుడ్ సమాచారం. కాగా, గతంలో అర్జున్ కపూర్ సల్మాన్ సోదరి అర్పితతో స్నేహంగా మెలిగేవాడని కూడా వార్తలు వెలువడ్డాయి.

  • Loading...

More Telugu News