: భారత్ గోల్డెన్ బాయ్, బాక్సర్ విజేందర్ కు 'హారర్ సినిమా' చూపిస్తా: ఆంద్రెజ్ సోల్డ్రా


ప్రొఫెషనల్ బాక్సర్ గా మారిన మాజీ ఒలింపియన్ విజేందర్ సింగ్ కు హారర్ సినిమా చూపిస్తానని పోలెండ్ బాక్సర్ ఆంద్రెజ్ సోల్డ్రా సవాలు విసిరాడు. విజేందర్ సింగ్ కంటే మెరుగైన రికార్డు కలిగిన సోల్డ్రా మాట్లాడుతూ, విజేందర్ గతంలో తలపడినవారికి సరైన రికార్డులు లేవని అన్నాడు. వారంతా ఒక రకమైన బాక్సర్లైతే, తాను మరోరకమైన బాక్సర్ నని చెప్పాడు. పోలిష్ (పోలెండ్ జాతీయులు) బ్రీడ్ అలాంటిదని, అంచనాలు తమపై పని చేయవని అన్నాడు. ఇండియా గోల్డెన్ బాయ్ విజేందర్ కు 13న భయంకరమైన సినిమా చూపిస్తానని చెప్పాడు. విజేందర్ అదృష్ట రేఖ రేపటితో మారబోతోందని సోల్డ్రా చెప్పాడు. నాకౌట్ పంచ్ రుచి చూపిస్తానని సవాలు విసిరాడు. సోల్డ్రాతో మ్యాచ్ కోసం విజేందర్ తీవ్రంగా శ్రమించాడు. గతంలో కూడా ప్రత్యర్ధులు ఇలాగే నోరు పారేసుకోగా, విజేందర్ ఆత్మవిశ్వాసంతో బరిలో దిగాడు. నోరు పారేసుకున్న ప్రతి ఒక్కరికీ పంచ్ రుచి చూపి నాకౌట్ చేసి సత్తాచాటాడు. రేపటి మ్యాచ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Loading...

More Telugu News