: ఆసుపత్రిలో ఉద్దవ్ థాక్రే చేరికపై తప్పుగా ప్రచారం చేశారు: శివసేన యూత్ వింగ్ చీఫ్ ఆదిత్య థాక్రే
హెల్త్ చెకప్ కోసం ఆసుపత్రిలో చేరిన శివసేన ఛైర్ పర్సన్ ఉద్దవ్ థాక్రేపై మీడియా తప్పుడు ప్రచారం చేసిందని ఆ పార్టీ యూత్ వింగ్ యువసేన చీఫ్ ఆదిత్య థాక్రే అన్నారు. హెల్త్ చెకప్ అనంతరం కొద్ది సేపటి క్రితం ముంబైలోని ఆసుపత్రి నుంచి ఉద్దవ్ థాక్రే డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆదిత్య థాక్రే స్పందిస్తూ.. ఉద్దవ్ థాక్రే ఆరోగ్యంగానే ఉన్నారని, నిన్న ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి పలు మీడియా సంస్థలు తమ ఛైర్ పర్సన్ ఆరోగ్య పరిస్థితిపై ఊహాజనిత వార్తలు ప్రసారం చేశాయని అన్నారు. ఆసుపత్రిలో హెల్త్ చెకప్‌కు వచ్చిన ఉద్దవ్ థాక్రే సంబంధిత పరీక్షల తరువాత డిశ్చార్జ్ అయ్యారని ఆదిత్య థాక్రే చెప్పారు.