: టీడీపీలోకి రావాలంటూ నాకు ఆశలు చూపించారు... బెదిరించారు: వైఎస్సార్సీపీ నేత రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి


టీడీపీలోకి రావాలంటూ తనకు చాలా ఆశలు చూపించారని, చివరకు ఆ పార్టీ నేతలు బెదిరింపులకు కూడా పాల్పడ్డారని నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, తాను టీడీపీలో చేరుతున్నట్లు ఒక పత్రికలో అసత్య కథనాలు ప్రచురితమయ్యాయని మండిపడ్డారు. టీడీపీలోకి రాకపోతే తనపై కేసులు పెడతామంటూ ఆ పార్టీ నేతలు బెదిరింపులకు కూడా పాల్పడ్డారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ చలువ వల్లే తాను ఎమ్మెల్యేగా గెలిచానని, జగన్ వెంటే తన ప్రయాణం కొనసాగుతుందని ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పారు.

  • Loading...

More Telugu News