: ప్రాజెక్టులపై జగన్ ది దొంగనాటకం: పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర


ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. ఏపీలో ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ కు తెలంగాణలో కాసుల వర్షం కురుస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏపీలో దీక్షలు చేస్తూ, తెలంగాణలో తమ నేతలకు జగన్ కాంట్రాక్టులు ఇప్పించుకుంటున్నారంటూ నరేంద్ర ఆరోపించారు. ‘ప్రాజెక్టులపై జగన్ దొంగనాటకమాడుతున్నారు. తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు వ్యతిరేకిస్తూ ఈ నెల 16, 17, 18వ తేదీలలో కర్నూల్ లో దీక్షలంటాడాయన. ఏ ప్రాజెక్టులైతే తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్నదని ఆరోపణలు చేస్తున్నాడో ఆ ప్రాజెక్టుల కాంట్రాక్టులను జగన్మోహన్ రెడ్డి తన అనుచరులకు ఇప్పిస్తున్నాడు’ అని నరేంద్ర విమర్శించారు.

  • Loading...

More Telugu News