: దాదాపు 'దాదా'యే... బీసీసీఐ రేసులోకి అనూహ్యంగా గంగూలీ పేరు!


ప్రపంచంలో అత్యత బలమైన క్రికెట్ బాడీగా ఉన్న బీసీసీఐకి శశాంక్ మనోహర్ రాజీనామా చేసి, ఐసీసీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తరువాత, తదుపరి బీసీసీఐ అధ్యక్ష పదవికి అనూహ్యంగా భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరు తెరపైకి వచ్చింది. వాస్తవానికి శశాంక్ తరువాత అనురాగ్ ఠాకూర్ కు అత్యున్నత పదవి దక్కుతుందని అందరూ భావిస్తూ వచ్చారు. ఆపై ప్రస్తుతం క్యాబ్ (క్రికెట్ ఆసోసియేషన్ ఆఫ్ బెంగాల్)కు అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ, బీసీసీఐ కార్యదర్శిగా ఎన్నికవుతారని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటిని తోసిపుచ్చుతూ, గంగూలీ స్వయంగా రంగంలోకి దిగాడు. తనకు మద్దతు కోసం బీసీసీఐ కార్యవర్గంతో ఆయన మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇక తదుపరి అధ్యక్ష ఎంపిక ఎప్పుడు జరగాలన్న విషయమై ప్రత్యేక సాధారణ సమావేశం నిర్ణయించి, ఓ తేదీని నిర్ణయించాలని వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. రాజీనామా చేసిన శశాంక్ సైతం ఐసీసీ చైర్మన్ హోదాలో గంగూలీకి మద్దతిస్తున్నట్టు సమాచారం. దీంతో అనురాగ్ ను వెనక్కు నెట్టేసి గంగూలీ ఎంపికయ్యే అవకాశాలను తోసిపుచ్చలేమని క్రీడాపండితులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News