: ఓ పార్సీ దేవాలయానికి వెళ్లి చూపించు: తృప్తీ దేశాయ్ కి ఏఐఎంఐఎం సవాల్


మహిళలకు సమాన హక్కులంటూ ఉద్యమిస్తున్న కార్యకర్త తృప్తీ దేశాయ్, భారీ పోలీసు బందోబస్తు మధ్య ముంబైలోని హజీ అలీ దర్గాకు వెళ్లిన కాసేపటికి ఏఐఎంఐఎం నేత హాజీ రఫత్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తన జీవితంలో దర్గా గర్భాన్ని చేరలేరని అన్నారు. ఇప్పుడిక ఓ పార్శీ దేవాలయానికి ఆమె వెళ్లాలని, అప్పుడు తాము తృప్తి మహిళల హక్కుల కోసం పోరాడుతున్నదని అంగీకరిస్తామని అన్నారు. "తృప్తీ దేశాయ్ హజీ అలీ దర్గాకు రావడం మాకు సంతోషకరం. అయితే, ముస్లిం మతాన్ని, ప్రజల నమ్మకాలను కించపరుస్తూ, పోలీసుల మధ్య బలవంతంగా ప్రవేశించడం సరికాదు. ఆమె ఒంటరిగా వచ్చినా మేము సంతోషించేవాళ్లం. ఇప్పుడు ఆమెకు మాదో సవాల్. ఓ పార్శీ దేవాలయానికి వెళ్లి చూపాలి. ఆ గుడుల లోకి కేవలం పార్శీలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది" అని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News