: షిరిడీలో భూతమై తిరుగుతున్న సాయి... కాదంటే ముస్లిమని ఒప్పుకోండి: గోవిందానంద


పలువురు హిందువులు భక్తితో పూజించే సాయిబాబా దేవుడే కాదని, ఆయన భూతమై తిరుగుతున్నాడని శ్రీ గోవిందానంద వ్యాఖ్యానించారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, మరణించిన వ్యక్తికి కర్మకాండలు జరగకుంటే, ప్రేతమై సంచరిస్తుందన్నది అందరికీ తెలిసిందేనని, దీని ప్రకారం సాయి భూతమై సంచరిస్తున్నాడని, ఓ భూతాన్ని పూజించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఒకవేళ సాయి మృతదేహాన్ని ఖననం చేశామని చెప్పుకున్నట్లయితే, ఆయన ముస్లిం మతానికి చెందిన వాడని ఒప్పుకోవాలని, ఓ ముస్లింకు పూజలు చేయాల్సిన అవసరం హిందువులకు లేదని అన్నారు. సాయి 100 సంవత్సరాలకు పూర్వం బతికే ఉన్నందున, ఆయన హిందువా? ముస్లిమా? అన్నది ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ ప్రచురించిన బుక్ చూపుతూ, ఆయన ముస్లిం అని స్పష్టంగా ఉందని చెప్పారు. ఆయన పేరు చెప్పుకుని హిందువులను మోసం చేస్తూ, మభ్య పెడుతూ, డబ్బు దండుకుంటున్నారని రమణానందను ఉద్దేశించి పంపా క్షేత్ర పీఠాధిపతి గోవిందానంద ఆరోపించారు.

  • Loading...

More Telugu News