: శ్రీ పీఠం స్వామి పరిపూర్ణానందను 'నువ్వు' అన్న రమణానంద... సరికాదని మొట్టికాయలు!
ప్రముఖ తెలుగు టెలివిజన్ చానల్ లో సాయిబాబాపై జరుగుతున్న చర్చలో వ్యక్తిగత దూషణలు మిన్నంటుతున్నాయి. రమణానంద మహర్షి, శ్రీ గోవిందానందల మధ్య జరుగుతున్న చర్చలోకి ఫోన్ లైన్ ద్వారా శ్రీ పీఠం స్వామి పరిపూర్ణానంద వచ్చారు. ఆ సమయంలో పరిపూర్ణానంద వేస్తున్న ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేకపోయిన రమణానంద పదేపదే 'నువ్వు' అని సంబోధించగా, దాన్ని పరిపూర్ణానంద అడ్డుకున్నారు. వ్యక్తిగా ఉన్నత స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి ఇతరులను గౌరవించాలన్న కనీస జ్ఞానాన్ని కలిగివుండాలని హితబోధ చేశారు. పక్కవారిని గౌరవిస్తేనే తనకు గౌరవం లభిస్తుందన్న చిన్న విషయం తెలియని వారు ఇతరులకు మార్గనిర్దేశం ఎలా చేస్తారని మొట్టికాయలు వేశారు. దీనిపై రమణానంద స్పందిస్తూ, తాను వయసులో పెద్దవాడిని కాబట్టి చిన్నవాడైన పరిపూర్ణానందను నువ్వు అని అనవచ్చని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దీనికి అడ్డుపడ్డ గోవిందానంద, జ్ఞానంలో పెద్దగా ఉండాలే తప్ప వయసులో పెద్దయినంత మాత్రాన అగౌరవ పరిచేలా ఎందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.