: ఉమ్మడి అభ్యర్థినే గెలిపించండి.. టీఆర్ఎస్‌కు గట్టి బుద్ధి చెప్పండి: పాలేరులో రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సమితిపై టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఖమ్మం జిల్లా పాలేరులో నిర్వహించిన ఉప ఎన్నిక ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ... పాలేరు పోరులో తాము మద్దతిస్తోన్న ఉమ్మడి అభర్థినే గెలిపించి, ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పాలని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ డబ్బు వసూళ్లకు పాల్పడుతోందని, ఇతర రాష్ట్రాల కాంట్రాక్టర్లకు ఖమ్మం జిల్లాలో పనులు అప్పగిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తుమ్మల నాగేశ్వరరావు ఇంతవరకు జిల్లాలో ఎటువంటి అభివృద్ధి పనులూ చేయలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. దివంగత నేత రాంరెడ్డి వెంకట్ రెడ్డి నీతి నిజాయతికి నిదర్శనమని ఆయన అన్నారు. పాలేరులో సుచరితారెడ్డిని గెలిపించి టీఆర్ఎస్ కి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.