: ఫిరాయింపుల గురించా... అబ్బే..: ప్రధానితో భేటీ అనంతరం గవర్నర్ నరసింహన్
తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పార్టీ ఫిరాయింపుల గురించి, తాజా రాజకీయాల గురించి తానేమీ ప్రధానితో చర్చించలేదని గవర్నర్ నరసింహన్ వెల్లడించారు. ఈ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను కరవు పరిస్థితుల గురించి మాట్లాడానని, సాధారణ అంశాలపైనే తమ మధ్య చర్చ జరిగిందని స్పష్టం చేశారు. మీడియా ఫిరాయింపుల సమస్యపై ప్రశ్నించగా, అబ్బే... అటువంటిదేమీ లేదని అన్నారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లోని రాజకీయ పరిస్థితులపై తానేమీ మాట్లాడబోనని చెప్పి తప్పించుకున్నారు.