: సాయి మందిరంలో వినాయకుడు, శివుడి విగ్రహాలెందుకు?: శ్రీ గోవిందానంద


సనాతన ధర్మాలకు, శంకరాచార్యుల సంప్రదాయాలకు విరుద్ధంగా, మతమే లేని సాయిబాబా దేవాలయాల్లో హిందువుల దేవుళ్ల విగ్రహాలు పెట్టడం సరికాదని, సాయి దేవాలయాల్లో హిందూ దేవుళ్ల విగ్రహాలు పెట్టకుండా పూజలు చేసుకుంటే తమకు అభ్యంతరాలు లేవని శ్రీ గోవిందానంద వ్యాఖ్యానించారు. ఎవరు పడితే వారు పీఠాలు పెడుతూ ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. దేనికైనా శాస్త్రమే ప్రమాణమని ఆయన అన్నారు. సాయికి చేస్తున్న పూజలు ఏ శాస్త్రంలో ఉన్నాయని, పూజలు ఇలా చేయాలని ఎక్కడ రాసుందని అడిగారు. హిందూమత శాస్త్రాల్లోని అంశాలనే తీసుకుని వాటిని కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో కులాలను, మతాలను దేవుళ్లకు ఎందుకు ఆపాదిస్తున్నారని రమణానంద తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News