: ప్రభుత్వం కేటాయించిన భూములను జగన్ బ్యాంకుల్లో తాకట్టుబెట్టి సొమ్ము చేసుకున్నారు: మంత్రి యనమల
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈరోజు విజయవాడలో మీడియాతో యనమల మాట్లాడుతూ... జగన్ బినామీ రాంప్రసాద్ గురించి పనామా పత్రాలు గుట్టురట్టు చేశాయన్నారు. జగన్ అవినీతిపై సీబీఐ, ఈడీ స్పందించాలన్నారు. పనామా పత్రాలు వెల్లడించిన వివరాలు పరిగణలోకి తీసుకొని జగన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందూ ప్రాజెక్టు, ఇందూ టెక్ జోన్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు భూములిచ్చి జగన్ డబ్బుకూడబెట్టాడని యనమల ఆరోపించారు. బ్రిటీష్ వర్జిన్ ఐల్యాండ్స్‌లో జగన్‌కు పెట్టుబడులు ఉన్నాయని, అవి ప్రభుత్వం కేటాయించిన భూములను జగన్ బ్యాంకుల్లో తాకట్టుబెట్టగా వచ్చిన సొమ్మేనని ఆయన ఆరోపించారు.