: జగన్ ప్రతిపక్ష హోదాను కేసీఆర్‌కు తాకట్టుపెట్టారు: ఎమ్మెల్యే దూళిపాళ్ల
వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రతిపక్ష హోదాను కేసీఆర్‌కు తాకట్టుపెట్టారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతుల ప్రయోజనాలను కేసీఆర్‌కు తాక్టటు పెట్టిన జగన్.. రైతుల కష్టాలపై మాట్లాడడం ఏంటని దూళిపాళ్ల ప్రశ్నించారు. అక్రమాస్తులు కూడబెట్టిన జగన్‌కు ధర్నాలు, దీక్షలు అంటూ ఆందోళనకు దిగే హక్కు ఎక్కడిదని దుయ్యబట్టారు. అటు ఏపీలో రైతుల కోసం అంటూ దీక్షను చేస్తూ ఇటు తెలంగాణలో వైసీపీ నేతలకు ప్రాజెక్టులు దక్కేలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతులకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ దీక్షలకు దిగుతోన్న జగన్‌కు అసలు దీక్ష చేసే హక్కేలేదని దూళిపాళ్ల వ్యాఖ్యానించారు.