: మానవత్వం నిలవాలంటే ట్రంప్ రావాలంటున్న హిందూ సంస్థ... ఆయన గెలుపునకు ప్రత్యేక పూజలు
రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడనున్న డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వానికి ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ, ఓ హిందూ సంస్థ ట్రంప్ వస్తేనే మానవత్వం నిలుస్తుందని చెబుతోంది. ఆయన గెలవాలని పూజలు, హోమాలు జరిపిస్తోంది. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న హిందూ సేనా నేషనలిస్ట్ గ్రూప్, జంతర్ మంతర్ వద్ద ట్రంప్ గెలుపును కాంక్షిస్తూ, హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేసింది. దేవతలంతా ఆయన గెలుపునకు సహకరించాలని కోరుకుంటున్నట్టు హిందూసేన వ్యవస్థాపకుడు విష్ణు గుప్తా వెల్లడించారు. ప్రపంచాన్ని ఇస్లామిక్ టెర్రరిజం నుంచి కాపాడాలంటే అది ఆయనకే సాధ్యమని ఆయన అన్నారు.