: ఆరు నెలలు... 12 సార్లు!: నెల్లూరు జిల్లాను వణికిస్తున్న భూకంపాలు
ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా భూకంపాలతో చిగురుటాకులా వణికిపోతోంది. గడచిన ఆరు నెలల్లో ఏకంగా 11 సార్లు సంభవించిన స్వల్ప భూకంపాలతో ఎప్పుడు, ఏ విపత్తు వచ్చి పడుతుందోనని ఆ జిల్లా వాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత మరోమారు (ఆరు నెలల్లో 12వ సారి) ఆ జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది. జిల్లాల్లోని వింజమూరు, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లోని పలు ప్రాంతాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఈ భూకంపం కారణంగా జరిగిన నష్టానికి సంబంధించి వివరాలు వెల్లడి కాలేదు.